Wednesday, February 2, 2011

Jai Bolo Telangana- Movie Review

నిజాముకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణా సాయుధ పోరాటంతో పోల్చినా, 1969లో ఉవ్వెత్తున ఎగిసిన తొలి తెలంగాణ ఉద్యమంతో పోల్చినా ప్రస్తుతం సాగుతున్న ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఒక ప్రత్యేకత ఉన్నది. తెలంగాణ రాష్ట్ర డిమాండుతో పాటు ఇక్కడి సంస్కృతి, చరిత్ర, సాంప్రదాయాలు, కళలకూ ఈ ఉద్యమ కాలం ఒక పునరుజ్జీవన (Renaissance) దశవంటిది.

ఈ కాలంలో తెలంగాణ నేపధ్యంగా కొన్ని వందల పుస్తకాలు వచ్చాయి. అలాగే వందల సంఖ్యలో పాటలూ వచ్చాయి. కానీ ఉద్యమ నేపధ్యంలో సినిమాలు మాత్రం యేడాది క్రితం వరకూ రాలేదనే చెప్పాలి.
తెలంగాణా సాయుధ పోరాటం నేపధ్యంగా గత యేడాది ఆర్. నారాయణ మూర్తి తీసిన “వీర తెలంగాణ” తరువాత ఇప్పుడు సమకాలీన తెలంగాణ ఉద్యమాన్ని కాన్వాసుగా చేసుకుని శంకర్ నిర్మించిన జై భోలో తెలంగాణ విడుదలయ్యింది.
నల్లగొండలో ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చి టాలీవుడ్ లో భారీ చిత్రాల దర్శకుడిగా ఎదిగిన శంకర్ జై భోలో తెలంగాణ చిత్రం చేస్తానని ప్రకటించినప్పటి నుండీ తెలంగాణ ప్రాంత ప్రజానీకం ఈ చిత్రం కొరకు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. కేసీయార్ మొదలుకొని గద్దర్ వరకూ తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొంటున్న అందరు నాయకులు, కవులు, కళాకారులు, రచయితలు ఇందులో ప్రధాన సన్నివేశాల్లో నటిస్తుండటంతో ఇక్కడి ప్రజల ఉత్సాహం రెట్టింపైంది. సినిమా పూర్తయాక సెన్సారు ఇబ్బందుల్లో చిక్కుకోవడంతో విడుదలలో ఇంకో వారం జాప్యం జరిగింది. ఎట్టకేలకు అడ్డంకులన్నీ అధిగమించి ఇవ్వాళ రిలీజయ్యింది జై భోలో తెలంగాణ.
వెండి తెర మీద ఈ చిత్రాన్ని చూస్తే గత యేడాది కాలంగా శంకర్ పడిన శ్రమకు ఫలితం దక్కిందనే చెప్పాలి.
స్థూలంగా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమం బ్యాక్ డ్రాప్ గా జరిగే ప్రేమ కధ ఇది. తెలంగాణా ఉద్యమాన్ని సబ్జెక్టుగా ఎంచుకుని సినిమా తీయడమంటే మాటలు కాదు. ఆరు దశాబ్దాల పోరాట చరిత్రను రెండు గంటల్లో కుదించడం అత్యంత కష్ట సాధ్యమైన విషయం. ఇక తెలంగాణా ప్రజల ఆకాక్షలను ఇతర ప్రాంతాల ప్రజలకు కూడా అర్థం అయ్యేలా తీయడం సులువైన పనేమీ కాదు.
అయితే ఇంత కష్టసాధ్యమైన పనిని శంకర్ చాలా నేర్పుగా చేశాడు. ఎక్కడా బిగి సడలకుండా, కత్తి మీద సాము లాంటి ఈ పనిని ప్రశంసనీయంగా నిర్వర్తించాడు.   చిత్రంలో సీమాంధ్ర ప్రజల మనో భావాలు ఎలా ఉన్నాయో చూపేందుకు ప్రయత్నించాడు.  ప్రాంతాలుగా విడిపోదాం, మనుషులుగా కలిసుందాం అనే సందేశాన్ని ఈ చిత్రం ద్వారా చాలా బలంగా ఇవ్వగలిగాడు శంకర్.
చిత్రానికి చక్రి సమకూర్చిన సంగీతం అద్భుతంగా ఉంది. ముఖ్యంగా డా. అందెశ్రీ రాసిన టైటిల్ సాంగ్ ఇప్పటికే తెలంగాణ ప్రాంతంలో మార్మోగిపోతోంది. ఈ పాటకు వందేమాతరం శ్రీనివాస్ గాత్రం గొప్ప ఊపునిచ్చింది.  ఇక గద్దర్ “పొడుస్తున్న పొద్దుమీద” పాట వచ్చినంత సేపూ ధియేటర్ లో చప్పట్లు, ఈలలే. కే.సీ.ఆర్ రాసిన “గారడి చేస్తున్రు” పాటకు కూడ మంచి స్పందన వచ్చింది.
ఇక నందిని సిధారెడ్డి గారు రాసిన “ఒక పువ్వు ఒక నవ్వు”, గోరటి వెంకన్న రాసిన “ఈ గాయం” పాటలు మనసును హత్తుకుంటాయి.
తెలంగాణ గ్రామీణ జీవనాన్ని శంకర్ అద్భుతంగా ఆవిష్కరించాడు. బంతి పూలూ, బటానీ పూల తీగలూ, తంగేడు, గునుగు పూలూ – ఇవన్నీ కలిసిన బతుకమ్మలూ – బోరు మోటారు కింద పిల్లగాండ్ల జలకాలాటలూ, గోళీలాటలూ – సిధా రెడ్డి గారి మాటలోనే చెప్పాలంటే సినిమా ఒక “బంతి పూల కచ్చరం” బండి లాగుంది.
తెలంగాణా గ్రామాల్లో కమ్మరి, కుమ్మరి, పద్మశాలి, స్వర్ణకార, గౌండ్ల, మేర, మంగలి, చాకలి, మేదర వంటి వృత్తి కులాల దైన్య స్థితిని శంకర్ కళ్లకు కట్టాడు. గోరటి వెంకన్న అప్పుడెప్పుడో “పల్లె కన్నీరు పెడుతుందో” అని రాసిన పాటకు ఈ సినిమా మరో సారి దృశ్య రూపం ఇచ్చినట్టుంది. సినిమాలో కొన్ని ఉద్వేగభరితమైన సన్నివేశాలు కనీళ్లు తెప్పిస్తాయి.
ఇక నటీ నటుల విషయానికి వస్తే జగపతి బాబు తెలంగాణ యాసలో మాట్లాడడానికి చాలా కష్టపడ్డాడు. జయమ్మ పాత్రలో స్మృతి ఇరానీ చక్కగా ఇమిడిపోయింది. కొత్త వారైనా హీరో, హీరోయిన్లు వారి పాత్రలకు సంపూర్ణ న్యాయం చేశారు. హీరోయిన్ మీరా నందన్ ముగ్ధ మనోహరంగా ఉంది. పారిశ్రామికవేత్త బొకారె పాత్రలో ఎ.వి.ఎస్ బాగానే నవ్విస్తాడు.
వర్షిత్ తాత పాత్ర పోషించిన ఆర్. విద్యాసాగర్ రావు నటన¬ చూసి నేనైతే ఆశ్చర్యపోయాను. ఎప్పుడూ తెలంగాణకు నదీ జలాల పంపకంలో జరిగిన అన్యాయాన్ని చెబుతుండే ఈ నీటి పారుదల నిపుణుడిలో ఒక మంచి నటుడున్నాడని తెలిసిందిప్పుడు.
ఇక తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్న అనేక మంది ఈ సినిమాలో కనపడుతారు. కే.సి.ఆర్ రెండు మూడు చోట్ల నిజ జీవిత పాత్రలోనే కనపడుతాడు. గద్దర్, విమలక్కలు తమ సహజశైలిలో ఉద్యమ గీతాలు పాడి ప్రేక్షకులను ఉత్తేజ పరుస్తారు.
బందగీ గోపన్న మిత్రుల పాత్రలను తెలంగాణ ప్రజా ఫ్రంట్ నేత వేద్ కుమార్, ప్రముఖ జర్నలిస్టు నేతలు అల్లం నారాయణ, మల్లెపల్లి లక్ష్మయ్య, తెలంగాణ రచయితల వేదికకు చెందిన జూలూరి గౌరి శంకర్, ప్రముఖ గాయకుడు దేశపతి శ్రీనివాస్  పోషించారు.
ఇక ఇతర చోట్ల మనకు తెలంగాణ మట్టి మనుషులు వేనేపల్లి పాండురంగా రావు, తెలంగాణ నేతలు శ్రవణ్, ప్రకాశ్,  ఉస్మానియా జే.ఏ.సి నేతలు బాల లక్ష్మి, మణి, సుమన్, మర్రి అనిల్ కుమార్, ఎర్రోల్ల శ్రీనివాస్, ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్ధులు, అధ్యాపకులు కనపడుతారు.
తెలంగాణ ఉద్యమం చరిత్రలో ఈ చిత్రం ఒక మైలు రాయి అవుతుంది. నిబద్ధతతో, చక్కని సందేశంతో ఒక మహత్తర చిత్రాన్ని నిర్మించిన శంకర్ కు అభినందనలు
కొణతం దిలీప్
JBT Review in Deccan Chronicle

The much-hyped Jai Bolo Telangana is a spirited effort to champion the cause of separate statehood and deftly captures the sufferings of farmers, unemployed and poor people of the region. N. Shankar, who had made Encounter, is back in his element in this saga of agitators and cleverly handles the theme with some hard-hitting dialogues and invigorating songs making it a tribute to the martyrs of the region.
However, he also avoids taking a provocative stance and makes it clear that he prefers a friendly bifurcation of Andhra Pradesh.
The film doesn’t mince words in blaming the nexus between politicians-corporate-investors-police for delay in granting separate statehood. It also ridicules the propagators of United Andhra for shedding crocodile tears to save their huge investments in the region.

Senior actors Jagapathi Babu, Smriti Irani, AVS and Janardhan Maharshi come up with decent performances.
Although Jai Bolo... is no classic, it has its share of touching moments — the suicide of a youngster and the pathetic living conditions of the poor.
The film also has stirring songs by Gaddar and Chakri that sustain the mood. Guest appearances by the TRS president, Mr K. Chandrasekhar Rao, Prof Jaishankar and some T-protagonists give the film a realistic touch.
The story revolves around a widow (Smriti) who has a young son (Sandeep). The youth dislikes agitations and wants to lead a peaceful life. He also falls in love with a girl (Meera) and she reciprocates. Things change after they visit their village and Sandeep is moved by the plight of farmers. As the T-agitation heats up he joins others to stage protests.
On the other hand, an activist leader of united Andhra wants to get married to Meera and her family agrees to the proposal.
Jagapathi Babu appears in two roles and does a good job, whereas Smriti Irani delivers a decent performance. But it is AVS and Janardhan Maharshi who provide some lighter moments of the film.

JBT Review in Hindu

Jai Bolo Telangana has the backdrop of Telangana movement to frame a love story. In the process, the director tries to showcase the culture, the ethos and nature of people in the region aspiring for a separate state.
Beginning with the 1948 movement against Nizam to the tumultuous days in Osmania University two years back, the director Shankar shows the evolution and the long-pending nature of the demand using cinematic montage and news footage.
At the centre of the story is the story of Varshit (Sandeep), who doesn't believe in dying for a cause as he knows what it is to lose a parent. Jayamma (Smriti Irani) is his mother. The young man walks with the confidence of a care free student as he woos his lady love Sahaja (Meera Nandan). It is only in the second half, that the movie moves on to firm footing as the reality of Telangana is driven home (we should excuse all the pat cliches that the director has used). The girl happens to be from Vijayawada and her parents want her to get married to a local politician's son who has a stake in keeping the state united to protect his investments. The highlight of the movie is easily the peppy number set to a foot tapping Chakri's music: Garedu chesindru and the performance of singing dancing balladeer Gaddar whose energetic dance is brilliant. While the song penned by KCR sums up what is happening and is being done to the region, Gaddar's mellow poetry is sentimental love for the region seen through its natural bounty.

A scene in the movie, the heroine serves potato curry to her brother who becomes furious at being served what he doesn't like and has never eaten. “If you cannot eat what you don't like even once, why do you want to force other people to live with you when they want to go their separate way,” she asks as the cinema hall echoes to slogans and catcalls.
For a movie that could have been extremely provocative, it ends up as a fangless slogan (thanks) Shame  to the dexterous scissor hands of Censor Board. By turning the clutch of politicians and bureaucrats into villains, the director tries to drive home a message that the movement is not against the people but about identity, dignity and jobs.



Monday, January 31, 2011

Jai Bolo Telangana- Movie Release

Note: This blog is created to exchange information about the movie and to share opinions on the movie. This place is for movie admirers & critics to write an opinion and this is not a place for any abusive or hatred messages.

Jai Bolo Telangana, a movie of life time will be in the theatres worldwide this week. This movie is first of its kind in the history of Indian Cinema. This film portrays real life situation in the current state of Andhra Pradesh, India. This has actors who are real life leaders, activists, students, singers, lawyers, journalists & people from all professions. Many famous activists appear in the movie,  few to name are Deshapati Srinivas, Mallepalli Laxmiah, Gaddar, KCR, Kodandaram, other professors, student leaders & many more..

The thought, message of the film is unique & fresh; every movie lover would extremely love this movie. It is a must watch!!!!!!! The title of the movie may give you the impression that it is Pro-Telangana & Anti-Andhra BUT ITS NOT. This movie is about people, love & integrity. 
Please visit this blog for most updated information about the theatres,  timings & contacts in your cities & post your comments for additional information.  Let me know if you wanted your country, state, city to be published here.


LocationTheatreContact Person
Virginia Phoenix World gate 9, Herndon (us.bigcinemas.com)Aravind Thakkalapalli - 571-499-9924
Vijay Krishna Chatla - 484-547-1559
Santosh Vemula - 630-863-0600
New JerseyBig cinemas Movie city 8, Edison (us.bigcinemas.com)Murali Chintalpani: 908-247-3517
Shravan Poreddy: 913-548-8343
Jamuna Puskur: 732-662-4117
DallasHollywood Theatres, Irving (www.gohollywood.com)Ganga Yadav Devara: 972-999-7978
Mahendar Ghanapuram: 214-529-3257
CaliforniaBig cinemas Towne3, San Jose (us.bigcinemas.com)Sreenath Muskula: 937-903-3040
Sridhar Gurram: 408-627-1645
Dayanand Dudyala: 510-396-7358
ChicagoBig cinemas Golf Glen, Niles (us.bigcinemas.com)Murali Ramagoni: 503-560-5855                    Srinivas Goud: 847- 668- 7948
Srinivas Sarikonda: 630-364-4535
MinneapolisBrookdale cinema, Brooklyn Center (www.mncinema.com)Pawan Kumar Kondam: 914-434-4783        Madhu Kolan: 651-398-7400
Mahi Nagender: 847-452-5000
AtlantaBig cinemas Peachtree 8, Norcross (us.bigcinemas.com)Dharam Guravareddy: 770-597-9866                   Venkat Veeraneni: 732-801-9554
Chandramohan Nellutla: 678-467-3826
UKCharan Reddy: +44-7921713346
SingaporeBhasker Reddy: +65-84286570
Global Pawan Kumar Kondam: 914-434-4783
Murali Ramagoni: 503-560-5855
Dharam Guravareddy: 770-597-9866